అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలంలో కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్ వద్ద నివసించే నరేంద్ర , చరణ్ సోదరులు. వీరిద్దరూ తల్లిదండ్రులు, మరికొందరితో కలిసి ఆదివారం ఉదయం పాల వెంకటాపురం గ్రామంలోని మామిడితోటకు పని కోసం వెళ్లారు. మామిడి తోటలోని చెట్లకు పురుగులమందు పిచికారీ చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో చరణ్ ప్రమాదవశాత్తూ కాలుజారి నీటి కుంటలో పడిపోయారు. తమ్ముణ్ని కాపాడే ప్రయత్నంలో అన్న నరేంద్ర కూడా నీటికుంటలో పడిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవటంతో.. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

