ఓ యువకుడు, బాలిక(17)ను తీసుకొని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రేమ జంటను కూలీ పనులు చేస్తున్న అశోక్ కుమార్(26), లక్ష్మణ్(25) గమనించి వారిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని స్నేహితుడి ద్వారా రూ. 6500 ఫోన్ పే చేయించుకున్నారు. యువకుడి ముందే బాలికపై లక్ష్మణ్, అశోక్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్టు కింద ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

