కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరా చౌక్ దగ్గర కార్నర్ లో కెటిఆర్ మాట్లాడారు. రైతు భరోసాను సిఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని, ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని,
ఆరుగ్యారెంటీల పేర్లుతో ప్రజల్ని మోసం చేశారని కెటిఆర్ మండిపడ్డారు.

