
వెస్ట్ బెంగాల్ లో ఇటీవల ఒడిషాకు చెందిన ఎంబీబీఎస్ యువతిపై అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ “బాధితురాలు రాత్రి 12:30 గంటలకు బయట ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. అయితే, సీఎం వ్యాఖ్యలను బాధితురాలి తండ్రి పూర్తిగా ఖండించారు. ఈ ఘటన రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగిందని ఆయన మీడియాకు తెలిపారు. తన కూతురు రాత్రి 8 గంటలకు బయటకు వెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నట్లు తెలిపారు.