వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరగడం అంటే మధ్యతరగతి ప్రజలను అణచివేయడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలపై ఆమె ఈ మేర వ్యాఖ్యానించారు. పన్ను వసూళ్లు పెరుగుతున్నాయంటే దేశంలో మధ్యతరగతి వర్గం విస్తరిస్తుందనే అర్థం తప్ప, క్షీణించడం లేదని ఆమె వెల్లడించారు. పన్ను వసూళ్ల పెరుగుదలపై వస్తున్న ఆరోపణలను ఆమె తోసిబుచ్చారు. అది ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించినట్లు వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు.

