దాదాపు ఏడాది తర్వాత బుధవారం (ఫిబ్రవరి 4, 2025) మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. కొత్తగా నియమితులైన బిజెపి శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అభ్యర్థన పెట్టుకున్నారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

