భారత్-చైనా సరిహద్దులో ఒక స్పై రోబోట్ కలకలం రేపింది. ఎల్‌ఏసీ సమీపంలో చైనాకు చెందిన ఓ రోబోట్‌ను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
భారత సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి రోబోట్లను చైనా నిఘా కోసం ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందున్న చైనా.. ఇప్పుడు సైనిక శక్తిలో కూడా రోబోట్లను విరివిగా వాడుతోంది. అత్యాధునిక డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్ ఉపయోగిస్తోంది.

