ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందన్నదే ప్రపంచ ఆర్థిక గమ్యాన్ని నిర్ణయించే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాలో 15 శాతం నుంచి 20 శాతం వరకు అంతరాయాన్ని కలిగించే స్థాయికి చేరుకుంది.ఈ సంక్షోభాన్ని ప్రపంచానికి ఒక హెచ్చరికగా భావించి, దేశాలు తమ ఆర్థిక వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన

