కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 నిర్వాహకులపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో నిహారిక, నాగార్జున కలుసుకున్నారు. అక్కడ వీరిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ బాస్ 9 గురించి, భరణి గురించి చర్చ వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారింది. భరణి మేనేజ్మెంట్ కోటా అనే విషయం మరోసారి కన్ఫర్మ్ అయింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

