
పాకిస్థాన్‌లోని ప్రతీ ఇంచు భూమి కూడా భారత బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలోనే ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని పాక్‌ను హెచ్చరించారు. భారత్‌కు విజయం ఒక హాబీగా మారిందని ఆపరేషన్ సిందూర్ నిరూపించిందని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన తొలి విడత బ్రహ్మోస్ క్షిపణీ వ్యవస్థలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి రాజ్‌నాథ్ జెండా ఊపి సైన్యానికి అప్పగించారు.