బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కార్యాలయానికి హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆమె హైదరాబాద్లోని ఈడీ రీజినల్ కార్యాలయానికి చేరుకొని విచారణాధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో పలు సినీ, క్రీడా ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడంతో, దర్యాప్తు వేగవంతం అయ్యింది.

