ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆధారాలు లేపేసిండని విమర్శించారు. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే మధ్యాహ్నం 3 గంటల దాకా మంటలు అదుపు చేయలేదని.. బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పట్టిందా అని ప్రశ్నించారు.

