భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబిన్ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని వెల్లడించారు
నితిన్ నబిన్ ప్రస్తుతం సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు.

