ఆస్ట్రేలియాలో దుండుగులు రెచ్చిపోయారు. ప్రముఖ బీచ్‌లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఈ ఘటనలో కనీసం 10 మంది పర్యాటకులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మొత్తం 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమవ్వగా.. మరొకర్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులతో పర్యాటకుల హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ప్రశాంతంగా ఉన్న బీచ్‌లో ఒక్కసారిగా బీతావాహ పరిస్థితి నెలకుంది.

