బీఆర్ఎస్ (BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

