కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సన్నిహితుడు సతీశ్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల నుండి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

