తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ చేత విచారణ జరిపించాలని,సీఎం రేవంత్ రెడ్డే ఫోన్ ట్యాపింగ్ బాధితుడని, అయినా ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్క అరెస్ట్ కూడా జరగలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తక్షణమే స్పందించారు. “తప్పులు, అవినీతి బయటపెట్టడమే మా లక్ష్యం. అరెస్టులకోసం రాజకీయం చేయడం కాదు, అంటూ బండి వ్యాఖ్యల్ని ఖండించారు. ఇలాంటివే మాట్లాడుతూ ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు? అంటూ ప్రశ్నించారు.

