రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఫ్రాన్స్‌లో తాజాగా నిరసనలు చెలరేగాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో పెద్ద ఎత్తున వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ నగరమైన రెన్నెస్‌లో నిరసనకారులు ఓ బస్సును తగలబెట్టారు. రంగంలోకి దిగిన అధికారులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

