మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా వైసీపీ నేత మద్యం పార్టీ నిర్వహించడం కలకలం రేపుతోంది. ఈ పార్టీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మాధురి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం మొయినాబాద్ లోని ఫామ్‌హౌస్‌లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి లిక్కర్ పార్టీ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ మందు పార్టీలో అనుమతి లేకుండా మద్యం వినియోగించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పెండెంట్ ఫామ్‌హౌస్‌పై గురువారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు.

