కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. జీవన్ రెడ్డితో గంటకు పైగా మంత్రులు సమావేశమయ్యారు.జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై పట్టు వీడలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. మంత్రులు పార్టీలో కొనసాగాలని కోరారు. మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

