తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికాలో దుర్మరణం పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2016లో ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్లిన అతడు, చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం దొరకకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. పోలీసుల ప్రకటన ప్రకారం.. ఆ గొడవలో నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేశాడని , ఆ సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, అందులో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు అని పేర్కొన్నారు.

