ప్రభుత్వం ఇచ్చే పెన్షన్.. రేషన్ బియ్యం తో కాలం వెళ్ళబోతున్న వృద్ధురాలికి అధికారులు పెన్షన్ కట్ చేయడంతో బెంగతో మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల,
స్థానికుల కథనం ప్రకారం అల్లాదుర్గం గ్రామానికి చెందిన తుపాకుల సంగమ్మ (78)సంవత్సరాలు భర్త ఎప్పుడో మరణించాడు, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పై ఆధారపడి జీవిస్తుంది. ఎన్నో ఏండ్లుగా పెన్షన్ పొందుతున్న
మూడు నెలలు సరిగా పెన్షన్ తీసుకోవడం లేదని సాకుతో అధికారులు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు.

