పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవికి చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లి మండలంలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. దీంతో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు బీటెక్ రవి అక్కడకు వెళ్లారు. అయితే బీటెక్ రవి రాకతో అమ్మగారిపల్లి గ్రామస్తులు.. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

