ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన అఫ్రిదీని ఖైబర్ ఫఖ్తున్ఖా ప్రావిన్స్‌లో గుర్తుతెలియని దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో అఫ్రిదీ ప్రాణాలు కోల్పోయాడని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు. ఖైబర్ పంక్తున్‌ఖ్వా లో ఉగ్రవాద గ్రూపుల చర్యలకు, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌లో అఫ్రిదీ కీలక పాత్ర వహించేవాడు.ఖైబర్ లోని జఖాఖెల్ గిరిజన తెగలకు చెందిన అఫ్రిదీ ప్రఖ్యాత మత విద్యావేత్తగా పేరు పొందాడు.

