అటు పల్లెల్లో.. ఇటు పట్నంలో మొదలైన సాగు, తాగునీటి కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పల్లెల్లో సాగునీళ్లు లేవు.. పట్నంలో తాగునీళ్లు లేవు అని కేటీఆర్ విమర్శించారు. నాడు ఇంటింటికీ నల్లా నీళ్లు
నేడు సాగు, తాగునీళ్లు లేక జనం కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు మోసానికి సాక్ష్యంగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయన్నారు. బోర్లు అడుగంటి పోయాయని, పొలాలు పడావున పడ్డాయన్నారు.

