బాలీవుడ్ ‘భాయ్ జాన్’ సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 27) తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై సమీపంలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో డిసెంబర్ 26 రాత్రి నుంచే భారీ స్థాయిలో బర్త్‌డే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. సల్మాన్ బర్త్‌డే పార్టీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి ధోనితో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

