స్విట్జర్లాండ్‌లో లే కాన్ట్సెలేషన్ అనే బార్‌లో జరిగిన న్యూఇయర్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. ప్రమాద సమయంలో బార్‌లో 100 మందికిపైగా ఉన్నారు. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు బార్ మొత్తం వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కొత్త ఏడాది రోజున ఈ ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.

