నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చూస్తుంటే తన మనసు చివుక్కుమంటోందని ఆయన అన్నారు. నేపాల్‌లో సుస్థిరత, శాంతి, సంపద.. వంటివి భారత్ ప్రథమ ప్రాధాన్యాలు. ఆ దేశంలోని సోదరులు, సోదరీమణులు.. అందరిని శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోడీ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.

