నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఉద్ధృతమవుతున్న వేళ, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ దుబాయ్‌కు వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేశంలో రెండో రోజూ ఆందోళనలు ముదురుతున్న నేపథ్యంలో, ఓలీ విమానాన్ని సిద్ధం చేసుకుని, రాజకీయ అనిశ్చితి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆగ్రహం, విపక్షాల నిరసనల మధ్య నేపాల్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. దీంతో ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

