నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన.. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. జగిత్యాల అబివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నా తప్ప పార్టీ మారలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేన్నారు. మీడియానే తనపై తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడటం కొసమెరుపు.

