టాలీవుడ్ స్టార్ హీరోయిన్, పలు సినిమాల్లో యాక్ట్ చేసిన పూనమ్ కౌర్ వేములవాడలోని శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పటి నటి. స్వామివారి కరుణ కటాక్షాలు టెక్స్టైల్ రంగంతోపాటు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. పెద్ద పెద్ద వాళ్లు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకోవాలని సూచించిన నేపథ్యంలో నేడు స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు హీరోయిన్ పూనమ్ కౌర్.

