పీసీబీ మొండి వైఖరితో అటు ఐసీసీ, ఇటు ప్రపంచ క్రికెట్ కు విఘాతం కలిగించేలా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రెసెంట్ మొండి వైఖరిపై వసీం అక్రం తనదైన శైలిలో విరుచుకపడ్డాడు. 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో వారికి సంఘీ భావంగా పాక్ కూడా భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరించాలని చూడటంపై అక్రం తీవ్ర స్థాయిలు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ తన ప్రయోజనాలను ఎందుకు ఫణ్ణంగా పెట్టాలని ఆయన సూటిగా ప్రశ్నించాడు.

