కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకుడు పీజేఆర్ నిఖార్సైన మాస్ లీడర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ చేసిన కృషి చిరస్మరణీయమని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగర రాజకీయాల్లో 50 ఏళ్లపాటు చెరగని ముద్రవేసిన ధీశాలి పీజేఆర్ అని ఆయన కొనియాడారు.

