భారత్ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండురోజుల పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6గంటలా 40 నిమిషాలకు ఆయన విమానం దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలను పుతిన్ తిలకించారు. అనంతరం ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకేకారులో వెళ్లారు.

