
<span;>దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ నక్సలిజం కేవలం భద్రతా సమస్య మాత్రమే కాకుండా యువత భవిష్యత్తుకు కూడా ముప్పుగా మారిందని తెలిపారు. నక్సలిజం అనే పదం వాస్తవానికి మావోవాద ఉగ్రవాదం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అర్బన్ నక్సల్స్ ఏర్పరచిన ఎకోసిస్టమ్ మావో ఉగ్రవాదాన్ని దాచిపెట్టడంలో పెద్ద పాత్ర వహించిందని ఆయన ఆరోపించారు.