ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు దుబాయ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల్లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఈ దాడుల మధ్య చిక్కుకుపోయారు. తాము ఉంటున్న ఇంటికి అత్యంత సమీపంలో మిస్సైళ్లు పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కంపించిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన వెల్లడించారు భారీ శబ్దాలకు తాము బస చేసిన ఇల్లు దద్దరిల్లిపోయిందని విష్ణు పేర్కొన్నారు. చిన్న కూతురు ఐరా తీవ్రంగా భయపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

