తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదీలీలు, నియామాకాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏసీబీ డైరెక్టర్ గా పదోన్నతి కల్పించింది. అవినాష్ మహంతి ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో మల్కాజ్ గిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి విధులు నిర్వర్తించారు.

