తమిళనాడులో విజిల్ మోత మోగిపోతోంది. ఇది మామూలు విజయం కాదు. రెండేళ్లలోనే ప్రభంజనం సృష్టించారు టీవీకే అధినేత విజయ్. అయితే.. ఈ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ సహా.. పలువురు మంత్రులు ఘోర పరాజయం చవిచూశారు. కొలత్తూరులో స్టాలిన్ ఓటిమిపాలయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరులో టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు. చెన్నై సిటీలోని చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ ఎదురీదుతున్నారు. మొత్తం 17 రౌండ్లలో ఇప్పటికి 12 రౌండ్లు పూర్తి కాగా.. కేవలం 6118 ఓట్ల ఆధిక్యంలో ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు.

