భారత సంబంధాలపై అమెరికా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది చైనా. భారత్‌తో తగ్గిన సరిహద్దు ఉద్రిక్తతలను ఉపయోగించి అమెరికా-ఇండియా సంబంధాలను దెబ్బతీస్తోందని పెంటగాన్ విడుదల చేసిన నివేదికను తప్పుబట్టింది. పాకిస్థాన్‌తో చైనా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటోందని తప్పుడు కథనాలతో విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని డ్రాగన్ ఆరోపించింది. అమెరికా తన సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఒక సాకును కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుంది” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు.

