తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని. ఇంకా చెప్పాలంటే 2021కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సోదరుడిలాంటి అనుబంధం ఉంది. డీఎంకే-కాంగ్రెస్ మధ్య పొత్తు బలంగా ఉంది. ఆ పార్టీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తాం. అయితే, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగమవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం అని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ స్టాలిన్ ఈ విషయాలు వెల్లడించారు.

