హమాస్ నేతలే లక్షంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ ఖతార్‌కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారనే భావన మొదలైంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్అల్హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. దీని గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని టెల్ అవీవ్ చెప్పింది. యూఎస్ కూడా దాన్ని అంగీకరించింది.

