శాంతి చర్చలపై మాట్లాడేందుకు అదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ కానున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలో జరగనున్న కీలక సమావేశానికి ముందు మిత్ర దేశాలైలన యూరోపియన్ యూనియన్ నేతలు, నాటో సభ్యులతో జెలెన్‌స్కీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్న జెలెన్‌స్కీ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అనుసరిస్తున్న దౌత్య మార్గాలు, రాబోయే రోజుల్లో తాము అనుసరించాల్సిన ప్రాధాన్యతలపై నేతలతో చర్చించారు.

