
క్రికెట్లో టెస్ట్ ట్వంటీ. ఈ ఫార్మాట్లో టెస్ట్ క్రికెట్ లోతైన వ్యూహాలను, టీ20 క్రికెట్ వేగం, ఉత్సాహంతో మిళితం చేయనున్నారు.20-20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. అంటే, టెస్ట్ మ్యాచ్‌లో మాదిరిగానే ప్రతి జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది ఫలితాలు కూడా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లాగే ఉంటాయి. అంటే, గెలుపు, ఓటమి, టై లేదా డ్రా వంటి నాలుగు రకాల ఫలితాలు ఇందులో సాధ్యమవుతాయి.