టీ20 ప్రపంచ కప్ 2026లో తొలి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. నేడు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. టాస్ పడిన సమయంలో వాతావరణం కాస్త మెరుగ్గానే ఉంది. టాస్ నెగ్గిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆట ప్రారంభం అవుతుందనగా.. భారీ వర్షం మొదలైంది. సమయం గడిచేకొద్దీ వర్షం పెరుగుతూనే పోయింది. దీంతో ఆటను నిర్వహించే అవకాశాలే లేకుండా పోయాయి. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

