ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్‌లతో సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???.. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే..నువ్వు నిజంగా రాయల్.. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు టార్గెట్‌గా ఈ స్టేటస్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది

