మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సెన్సార్ బోర్డుతో వివాదంలో చిక్కుకుంది. బాధిత మహిళ పాత్రకు ‘జానకి’ అనే పేరుపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, సినిమా సర్టిఫికేట్ జారీకి నిరాకరించింది. జానకి అంటే సీతాదేవి అనే అభిప్రాయం నేపథ్యంలో ఈ అభ్యంతరం వచ్చిందని సమాచారం. ఈ వ్యవహారం న్యాయస్థానంలో నడుస్తుండగానే సెన్సార్ బోర్డు ఎదుట అమ్మ, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో మలయాళ సినీ, సీరియల్ ఆర్టిస్టుల సభ్యులు ధర్నా చేపట్టారు.

