జర్మనీలోని మోయర్స్ పట్టణంలోని దుస్బర్గ్ గురుద్వారలో సిక్కులు ఘర్షణ పడ్డారు. ఘర్షణల్లో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గన్నులు, కత్తులు, పెప్పర్ స్ప్రేతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గురుద్వారలో చోటుచేసుకున్న ఘర్షణ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. రెండు గ్రూపుల మధ్య కొట్లాట జరిగింది. ఇటీవల కొత్త బోర్డు ఎన్నికైంది. అయితే ఆ సమావేశంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. హుండీ డబ్బు అంశంలో వివాదం చెలరేగినట్లు భావిస్తున్నారు.

