జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్‌కిర్చెన్‌లోని స్పార్కాస్కై బ్యాంకులో రూ.316 కోట్లను దోపిడీ చేశారు. క్రిస్మస్ సెలవులు కావడంతో రెండు రోజులు బ్యాంకులోనే ఉండి 3250 సెఫ్టీ డిపాజిట్లను కొల్లగొట్టారు. అలాగే లాకర్లలోని నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బుయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కాసై బ్యాంకు శాఖను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజి నుంచి బ్యాంకులోకి ప్రవేశించారు. గ్యారేజి నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్‌కు డ్రిల్‌తో రంధ్రం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు.

