మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా టీటీడీ అర్చకులు వేద అశీర్వచనం ఇచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చుకులు శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది పులివెందులలో మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సేవలో తరించారంటూ ఈ ముగ్గురు అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి
ప్రశాంతి తాజాగా నోటీసులు జారీ చేసారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసారు.

