సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ రైల్లో చైనా పర్యటనకు వెళ్లారు. తన ప్రత్యేకమైన ప్రేవేటు రైల్లో ఆయన సోమవారం సాయంత్రం చైనాకు బయలుదేరారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసి 80 సంవత్సరాలు అయిన నేపథ్యంలో చైనాలో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన నేటి సాయంత్రం అక్కడకు చేరుకుంటారు.

